పాదయాత్ర: పగటిపూట పాదయాత్ర చేస్తేనే ప్రజలకు మనం దగ్గర కాగలుగుతాం!: జగన్

  • పాదయాత్ర చేసేటప్పుడు కాళ్లకు బొబ్బలు రావడం సహజమే
  • వాటికి బ్యాండేజ్ వేసేస్తా.. అలానే నడిచేస్తా
  • ఇలాంటి వాటికి మానసికంగా సిద్ధమయ్యా: జగన్

వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసేటప్పుడు కాళ్లకు బొబ్బలు రావడం సహజమేనని, ఆ బొబ్బలకు బ్యాండేజ్ వేసేసి నడిచేస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. సాక్షి’ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘కాళ్లకు వచ్చిన బొబ్బలకు బ్యాండేజ్ వేసేస్తా. ఆ బొబ్బే గట్టిగా అయిపోతుంది..అలానే నడిచేస్తా. ఇలాంటి వాటికి మానసికంగా సిద్ధమయ్యాను కాబట్టే పాదయాత్ర చేస్తున్నా.

ప్రజలు తిరిగే సమయంలో చంద్రబాబునాయుడు నాడు పాదయాత్ర చేయలేదు. పగటి పూట చేయలేదు. నాలుగు గంటలకు మొదలుపెట్టి ప్రజలందరూ నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి ఒంటి గంటకో, రెండు గంటలకో చంద్రబాబు తన పాదయాత్రను ముగించేవారు. ప్రజలతో ఆయనకు పనిలేదు!..దటీజ్ చంద్రబాబునాయుడు! నాన్న పాదయాత్ర పగటిపూటే చేశారు.. నేను కూడా పగటి పూటే చేస్తున్నాను. పగటిపూట పాదయాత్ర చేస్తేనే ప్రజలకు మనం దగ్గర కాగలుగుతాం. వాళ్ల సమస్యలు వినగలుగుతాం, కష్టాలను చూడగలుగుతాం. పగటిపూట పాదయాత్ర చేస్తేనే వాళ్లు కూడా మనల్ని కలిసే అవకాశం ఉంటుంది. అందరూ నిద్రపోయిన తర్వాత పాదయాత్ర చేస్తే డిస్టెన్స్ కవర్ అవుతుందేమోగానీ, ప్రజల సమస్యలు తెలుసుకోలేం’ అంటూ చెప్పుకొచ్చారు జగన్.

  • Loading...

More Telugu News