sampoormesh babu: 'కేసీఆర్, కేటీఆర్ ల ప్రేమకు సదా బానిసను' అంటున్న సంపూర్ణేష్ బాబు

  • ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను కలిసిన సంపూర్ణేష్ బాబు
  • సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు
  • తనదైన శైలిలో వ్యాఖ్యలు

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేస్తూ.. 'తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, నా అభిమాన నాయకుడు, మా కేసీఆర్ గారిని కలవటం నా కల... ఆ కల ఇన్నేళ్లకి సాకారం అయింది. ఆయన నివాసంలో కలిసిన క్షణాలు' అంటూ వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ను కూడా కలిశానని తెలిపాడు. సదా వారి ప్రేమకు బానిసనని సంపూర్ణేష్ బాబు తెలిపాడు. 

  • Loading...

More Telugu News