సినీ నటి అర్చన: మా మేనేజర్ల కారణంగా నష్టపోయాను!: సినీ నటి అర్చన

  • నా ఫోన్ నెంబర్లు అవసరమైన వ్యక్తులకు మేనేజర్లు ఇచ్చేవారు కాదు
  • నా పారితోషికం గురించి ఇతర నటీమణులకు చెప్పేవారు
  • ఓ ఇంటర్వ్యూలో అర్చన

తన మేనేజర్ల కారణంగా సినిమాల్లో అవకాశాలు రాకుండా కొంత వరకు నష్టపోయానని సినీ నటి అర్చన అన్నారు. ‘ఐడ్రీమ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘నా మేనేజర్ల వల్ల నేను కొంత ఇబ్బందిపడ్డా. నేను తీసుకునే పారితోషికం గురించి ఇతర హీరోయిన్లకు చెబుతుండేవారు. దీంతో, అంతకన్నా తక్కువ పారితోషికానికి ఆయా హీరోయిన్లు లేదా నటీమణులు నాకు రావాల్సిన అవకాశాలను దక్కించుకునే వారు. నా ఫోన్ నెంబర్లు అవసరమైన వ్యక్తులకు నా మేనేజర్లు ఇచ్చేవారు కాదని నాకు తర్వాత తెలిసింది. ఆ తర్వాత నా మేనేజర్లను మందలించినా కూడా వారు దులిపేసుకునేవారు. పారితోషికం కన్నా స్క్రిప్ట్ బాగుంటే చేస్తానని నా మేనేజర్లకు నేను చెబుతుండేదానిని. కొన్నేళ్లుగా, నాకు మేనేజర్ ఎవరూ లేరు. నేనే, డైరెక్టుగా మాట్లాడుతున్నాను’ అని అర్చన తెలిపింది.

  • Loading...

More Telugu News