నాగార్జున: కొత్త సినిమా షూటింగ్ లో నాగార్జున చెప్పిన డైలాగ్ ఇదే!

  • ‘నేనడిగిన ప్రశ్నకు ..’  అనే డైలాగ్ చెప్పిన నాగార్జున
  • ఈ డైలాగ్ కోసం మొత్తం మూడు టేక్ లు తీసుకున్నారట
  • సౌండ్ ప్రాబ్లం వల్ల, లోవాయిస్ కారణంగా తీసుకున్న టేక్ లు 

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందుతున్న చిత్రం షూటింగ్ ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో నాగార్జునపై తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సన్నివేశంలో నాగార్జున చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఏంటంటే.. ‘నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా, నేను నిన్ను చంపటం గ్యారంటీ. ఎంత తొందరగా చెప్తే అంత తొందరగా చస్తావ్. తక్కువ నొప్పితో చస్తావా, ఎక్కువ నొప్పితో చస్తావా.. ’ అంటూ ఆ డైలాగ్ కొనసాగింది.

ఈ డైలాగ్ కోసం మొత్తం మూడు టేక్ లు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు టేక్ లు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే .. సౌండ్ ప్రాబ్లం వల్ల డైలాగ్ సరిగా వినిపించకపోవడంతో రెండో టేక్ తీసుకున్నారు. అయితే, అప్పుడు కూడా వాయిస్ వినిపించడంతో మూడో టేక్ తీసుకోవాల్సి వచ్చినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News