జగ్గయ్యపేట: జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ పై దాడి కేసు!

  • ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వలేదంటూ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ వాగ్వాదం
  • వైసీపీ ‘కృష్ణా’ స్టీరింగ్ కమిటీ సభ్యుడు రవితో ఘర్షణ
  • గాయాలపాలై ఆసుపత్రిలో చేరిన రవి
  • రాజగోపాల్ తనపై దాడి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు 

కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు బాహాబాహీకి దిగారు. జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ గా ఇటీవల ఎన్నికైన ఇంటూరి రాజగోపాల్, వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నంబూరి రవి మధ్య ఘర్షణ తలెత్తింది. ఇటీవల జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వలేదని రవితో రాజగోపాల్ వాగ్వాదానికి దిగాడు. అయితే, రాజగోపాల్ తనను కొట్టడంతో గాయాలయ్యాయంటూ రవి ఆసుపత్రిలో చేరాడు. ఈ వివాదం నేపథ్యంలో జగ్గయ్యపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News