కేసీఆర్: కేసీఆర్‌తో లగడపాటి భేటీ.. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించిన వైనం!
- హైదరాబాద్ లో కేసీఆర్ ను కలిసిన లగడపాటి
- తన కుమారుడి వివాహానికి రావాలంటూ ఆహ్వానం
- లగడపాటిని సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ తో విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లో కేసీఆర్ ని కలిసి తన కుమారుడి వివాహానికి రావాలంటూ ఆయన్ని ఆహ్వానించారు. పెళ్లిశుభలేఖను అందజేశారు. లగడపాటిని సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్, ఆయనతో కొంచెం సేపు ముచ్చటించారు. కాగా, ప్రత్యేక తెలంగాణ కోసం నాడు కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తే..రాష్ట్రం విడిపోకూడదని లగడపాటి కూడా దీక్ష చేశారు. రాష్ట్ర విభజన అనంతరం కలత చెందిన లగడపాటి రాజకీయాల నుంచి తప్పుకున్నారు.