దోనేపూడి శంకర్: కృష్ణానదిలో నడుస్తున్న బోట్లన్నీ ఆ మంత్రుల బినామీలవే: సీపీఐ నేత దోనేపూడి శంకర్
- విజయవాడలోని పున్నమి ఘాట్ దగ్గర సీపీఐ ఆందోళన
- మంత్రులు దేవినేని, ప్రత్తిపాటి పుల్లారావుపై ఆరోపణలు
- ప్రైవేట్ బోట్లను పూర్తిగా రద్దు చేయాలి
- అఖిల ప్రియ తన పదవికి రాజీనామా చేయాలి: సీపీఐ డిమాండ్
కృష్ణానదిలో నడుస్తున్న బోట్లన్నీ మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు బినామీలవేనని సీపీఐ నేత దోనేపూడి శంకర్ ఆరోపించారు. విజయవాడలోని పున్నమి ఘాట్ దగ్గర సీపీఐ ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా దోనేపూడి శంకర్ మీడియాతో మాట్లాడుతూ, ప్రైవేట్ బోట్లను పూర్తిగా రద్దు చేయాలని, ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియ తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.