పరుచూరి గోపాలకృష్ణ: ఆ రెండు ప్రమాద ఘటనలు నా మనసుని కలచివేశాయి: పరుచూరి గోపాలకృష్ణ

  •  పడవ ప్రమాదం.. అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాద ఘటనలపై స్పందించిన పరుచూరి 
  • ఇలాంటి నవంబర్ 13 మన జీవితంలో రాకూడదని ప్రార్థిస్తున్నా
  • ‘ట్విట్టర్’లో పరుచూరి పోస్ట్

సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటూ తరచుగా పోస్ట్ లు చేసే ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఓ ట్వీట్ చేశారు. విజయవాడలో రెండు రోజుల క్రితం జరిగిన పడవ ప్రమాదం, హైదరాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోస్ లో నిన్న జరిగిన అగ్నిప్రమాద ఘటనలపై పరుచూరి స్పందిస్తూ ఈ ట్వీట్ చేశారు. ‘అక్కడ కృష్ణమ్మలో జలసమాధి, ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని గారి ‘మనం’ జ్ఞాపకం అగ్నికి ఆహుతి..మనసుని కలచివేశాయి. ఇలాంటి నవంబర్ 13 మనజీవితంలో రాకూడదని ప్రార్థిస్తున్నా’ అని ఆ ట్వీట్ లో పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈ రెండు ప్రమాద సంఘటనలకు సంబంధించిన ఫొటోలను ఈ పోస్ట్ లో జతపరిచారు.

  • Loading...

More Telugu News