నాగార్జున: మాది ప్రైవేట్ ప్రాపర్టీ ..పబ్లిక్ ప్రాపర్టీ కాదు. స్టూడియోలోకి అనుమతించం!: మీడియా సిబ్బందితో నాగార్జున
- అన్నపూర్ణ స్టూడియోస్ లో అగ్నిప్రమాదం
- మీడియాను లోపలికి అనుమతించని సిబ్బంది
- ఈలోగా, అక్కడికి వచ్చిన నాగార్జున
హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో దానిని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా సిబ్బందిని లోపలికి అనుమతించలేదు. స్టూడియో సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ‘లోపలికి ఎందుకు అనుమతించరు?’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తుండగా.. నటుడు అక్కినేని నాగార్జున అక్కడికి వచ్చారు. తమది ప్రైవేట్ ప్రాపర్టీ అని, పబ్లిక్ ప్రాపర్టీ కాదని, అందువల్ల ఎవరినీ లోపలికి పంపించబోమని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం.