అన్నపూర్ణ స్టూడియో: అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

  • ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సినిమా సెట్టింగ్స్ దగ్ధం
  • మంటలార్పుతున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది
  • షార్ట్ సర్క్యూటే కారణంగా భావిస్తున్నారు 

హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈరోజు సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగగా రెండు సినిమా సెట్టింగ్స్ దగ్ధమయ్యాయి.  

అందుబాటులో ఉన్న నీటితో మంటలను ఆర్పేందుకు స్టూడియో సిబ్బంది యత్నించారు. ప్రమాద సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని, నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News