బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు: సభలో ప్రతిపక్షం లేకపోవడంతో బోర్ కొడుతోంది.. నిద్రొస్తోంది కూడా!: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

  • మా పార్టీ అనుమతిస్తే సభలో ప్రతిపక్షపాత్ర పోషిస్తా
  • పార్టీలు మారిన నేతలు రాజీనామాలు సమర్పిస్తే ఆరు నెలల్లోనే ఎన్నికలు  
  • మీడియాతో మాట్లాడిన విష్ణుకుమార్ రాజు

అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడంతో బోర్ కొడుతోందని, అసెంబ్లీలో ప్రశ్నించే అవకాశం లేకపోవడంతో నిద్రొస్తోందని ఏపీ బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిన్న మొదలైన సంగతి విదితమే. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీ అనుమతిస్తే సభలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తాననడం గమనార్హం.

ఏపీలో పార్టీలు మారిన నేతలు తమ పదవులకు రాజీనామాలు సమర్పిస్తే కనుక ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని అన్నారు. ఏపీ ప్రభుత్వం తక్షణమే వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెక్యూరిటీ గార్డులకు వేతనాలు చెల్లించాలని, కేంద్ర వేతన సంఘం నిబంధనల ప్రకారం రోజుకు రూ.448 ఇవ్వాలని అన్నారు.

  • Loading...

More Telugu News