మోత్కుపల్లి: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది: మోత్కుపల్లి
- కొందరు నేతలు పార్టీని వీడినా క్యాడర్ బలంగానే ఉంది
- పత్తి, వరి రైతుల సమస్యలపై పోరాడతాం
- ఈ నెల 20న నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తాం
- మీడియాతో మోత్కుపల్లి
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు వెల్లడించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సొంత ప్రయోజనాల కోసం కొందరు నేతలు పార్టీని వీడినప్పటికీ తెలంగాణలో టీడీపీ క్యాడర్ బలంగా ఉందని పేర్కొన్నారు. పత్తి, వరి రైతుల సమస్యలపై ఈ నెల 20న నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించనున్న విషయాన్ని ఈ సందర్భంగా మోత్కుపల్లి చెప్పారు.