టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ: బాలకృష్ణ గారూ! రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని దొంగల్లా చూస్తున్నారు!:వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
- జగన్ పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే
- నాడు వైఎస్ ధాటికి మీరు పదేళ్ల పాటు అధికారం కోల్పోయారు
- జగన్ పాదయాత్రతో మీ అందరిలో భయం పట్టుకుంది
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ‘తెలుగుదేశం పార్టీని ఢీ కొంటే కొండను ఢీ కొన్నట్టే..ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధిచెప్పినా.. జగన్ పాదయాత్ర చేస్తున్నారు’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించడం పై ఆయన నిప్పులు చెరిగారు.
‘బాలకృష్ణ గారూ! మేము సూటిగా అడుగుతున్నాం. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డిగారి దెబ్బకు పదేళ్ల పాటు మీరు అధికారం కోల్పోయారు. అటువంటి మీరు, గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి..మోదీ, పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకుని అధికారంలోకి వచ్చారు. ఈరోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని దొంగల్లా చూస్తున్నారు. జగన్ పాదయాత్ర మొదలుపెట్టగానే మీ అందరిలో భయం పట్టుకుంది’ అని ఆయన విమర్శించారు.