బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు: ప్రజల సమస్యలను ప్రస్తావించకపోతే ఏ పక్షంలో ఉన్నా ఒక్కటే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

  • రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • మిత్రపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలను ప్రస్తావిస్తాం
  • నిర్మాణాత్మక సలహాలు, సూచనలు, ఉద్దేశాలను తెలియజేస్తాం
  • మీడియాతో విష్ణుకుమార్ రాజు

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశాలకు ప్రతిపక్షం హాజరైనా కాకపోయినా ప్రజల సమస్యలను ప్రస్తావించాల్సిన అవసరం తమకు ఉందని అన్నారు. తాము మిత్రపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని, అలా చేయని పక్షంలో తాము మిత్ర పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఒక్కటేనని అన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని, నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News