‘మెహబూబా’: ‘మెహబూబా’ సెట్స్ లో తమాషా.. అంటూ వీడియో పోస్ట్ చేసిన చార్మి!

  • ‘మెహబూబా’ సెట్స్ చిత్రయూనిట్ సభ్యుల సరదా
  • తబలా వాయిస్తూ, స్టెప్పులేస్తూ ఎంజాయ్
  • ఇలా ఎంజాయ్ చేశామంటున్న చార్మి

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన తనయుడు ఆకాశ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మెహబూబా’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పంజాబ్, హర్యానాలలో జరుగుతోంది. ఈ  సినిమా సెట్స్ లో విశేషాలను ఈ చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు తమ సామాజిక మాధ్యమాల ద్వారా పోస్ట్ చేస్తూనే ఉంది. తాజాగా, ఇందుకు సంబంధించిన ఓ వీడియోను నటి చార్మి పోస్ట్ చేసింది. ‘ ‘మెహబూబా’ సెట్స్ లో తమాషాగా, సరదాగా మేము ఈవిధంగా ఎంజాయ్ చేస్తున్నాం’ అని చార్మి తన పోస్ట్ లో పేర్కొని ఈ వీడియో జతపరిచింది. ఈ వీడియోలో చిత్ర యూనిట్ కు చెందిన సభ్యులు సరదాగా తబలా వాయిస్తూ, స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.

  • Loading...

More Telugu News