: విగ్రహావిష్కరణకు ఇన్నేళ్ళు ఎందుకు పట్టిందో అందరికీ తెలుసు: పురందేశ్వరి
పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వేళ వివాదాలు వద్దని కేంద్రమంత్రి పురందేశ్వరి అంటున్నారు. విగ్రహం నెలకొల్పడానికి ఇన్నేళ్ళు పట్టేందుకు కారణమేమిటో అందరికీ తెలుసని ఆమె వ్యాఖ్యానించారు. ఇక, పిలవాల్సిన వాళ్ళందరికీ ఆహ్వానాలు పంపామని, లక్ష్మీపార్వతి విషయం ఆమె విచక్షణకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం తెలుగు వారందరికీ గర్వకారణమని చెప్పుకొచ్చారు.