చంద్రబాబు: నాడు పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబూ అసెంబ్లీకి హాజరుకాలేదుగా?: అంబటి రాంబాబు
- చంద్రబాబుపై విమర్శలు
- జగన్ ని విమర్శించడం అనైతికం
- ప్రభుత్వ వైఖరికి నిరసనగానే అసెంబ్లీ సమావేశాల బాయ్ కాట్
- పాత్రికేయులతో మాట్లాడిన అంబటి
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రపై, అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసిన విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై వైసీపీ అధికార ప్రతినిధి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నాడు పాదయాత్ర చేసినప్పుడు ఆయన కూడా అసెంబ్లీకి హాజరుకాలేదని, జగన్ ని విమర్శించడం అనైతికమని అన్నారు. ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి నిరసనగానే అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నామని చెబుతూ, సత్తెనపల్లి హైవే రోడ్డు విస్తరణలో నష్టపోయిన వ్యాపారులకు పరిహారాన్ని నగదు రూపంలోనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.