రంజీ మ్యాచ్: ఢిల్లీలో రంజీ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి కారు!

  • ఉత్తరప్రదేశ్-ఢిల్లీ మధ్య మ్యాచ్ జరుగుతుండగా సంఘటన
  • మైదానంలోకి నేరుగా కారుతో వచ్చిన వ్యక్తి
  • అదుపులోకి తీసుకుని విచారించిన అధికారులు

ఢిల్లీలోని పాలం ఎయిర్ ఫోర్స్ మైదానంలో రంజీ మ్యాచ్ జరుగుతుండగా తన కారుతో సహా ఓ వ్యక్తి వచ్చేశాడు! ఈ సంఘటనతో ‘రంజీ’ ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ మధ్య రంజీ మ్యాచ్ ఈ రోజు సాయంత్రం జరుగుతోంది. మరి కాసేపట్లో మ్యాచ్ ముగుస్తుందనగా.. సిల్వర్  గ్రే కారులో ఓ వ్యక్తి తన వాహనం నడుపుకుంటూ మైదానం మధ్యలోకి వచ్చేశాడు. దీంతో, మ్యాచ్ ను కొంచెం సేపు నిలిపివేశారు.

ఆ వెంటనే భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కాగా, వాహనం నడిపిన వ్యక్తిని ఎయిర్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని గిరీశ్ శర్మగా గుర్తించారు. గేటు వద్ద భద్రతా సిబ్బంది లేకపోవడం వల్లే తాను నేరుగా మైదానంలోకి వచ్చేనని గిరీశ్ వారితో చెప్పడం గమనార్హం. ఎయిర్ ఫోర్స్ అధికారులు ఈ కేసును ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. అనంతరం అంపైర్ ఆదేశాల మేరకు మ్యాచ్ ను తిరిగి కొనసాగించారు. ఈ సంఘటన చోటు చేసుకున్న సమయంలోఅంతర్జాతీయ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్ అక్కడే ఉన్నారు.

  • Loading...

More Telugu News