జీవిత రాజశేఖర్: థియేటర్ ముందు కన్నీరు పెట్టుకున్న జీవిత రాజశేఖర్
- రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమా ఈ రోజు విడుదల
- హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు వచ్చిన రాజశేఖర్, జీవిత
- ప్రేక్షకులతో ముచ్చట
- భావోద్వేగానికి గురైన జీవిత
రాజశేఖర్ నటించిన 'గరుడవేగ' సినిమా ఈ రోజు విడుదలైంది. హైదరాబాద్‌లో గరుడవేగ సినిమా ఆడుతోన్న థియేటర్లన్నీ ప్రేక్షకులతో నిండిపోయాయి. థియేటర్ల ముందు రాజశేఖర్ అభిమానులు ఎంతో హుషారుగా కనపడుతున్నారు. ఓ థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులతో ముచ్చటించిన రాజశేఖర్.. తాను ఓ సాధారణ మనిషినని అన్నారు.
అయితే, రాజశేఖర్ పక్కన ఉన్న ఓ అభిమాని ఆయనను ఆకాశానికెత్తేశాడు. రాజశేఖర్‌ను అసాధారణ మనిషని కొనియాడాడు. దీంతో అక్కడే ఉన్న జీవిత రాజశేఖర్ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఈ సినిమాను హిట్ చేసినందుకు కృతజ్ఞతలని ఆమె పేర్కొన్నారు. నిన్న ఆమె సోదరుడు మృతి చెందిన విషయం తెలిసిందే.