గాలి జనార్దన్ రెడ్డి: మా అబ్బాయిని సినీ హీరో చేయాలనుకుంటున్నా: గాలి జనార్దన్ రెడ్డి

  • గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి 
  • 2018 మార్చి తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా
  • పాత్రికేయులతో జనార్దన్ రెడ్డి

అక్రమ మైనింగ్ వ్యవహారంలో నిందితుడు, ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ (ఓఎంసీ) అధినేత గాలి జనార్దన్ రెడ్డి తన కుమారుడుని సినీ హీరోని చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. తన కుమారుడు కిరీటిని సినీ హీరో చేయాలని అనుకుంటున్నానని, ఈ విషయంపై 2018 మార్చి తర్వాత పూర్తి స్థాయిలో దృష్టి పెడతానని చెప్పారు.

కాగా, కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా రెండు రోజుల క్రితం ఆయనే స్వయంగా పాడిన పాట సీడీని బెంగళూరులోని చాముండేశ్వరి స్టూడియోలో ఆవిష్కరించారు. ఇదిలా ఉండగా, అక్రమ మైనింగ్ కేసుల విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు సీజ్ చేసిన బంగారు ఆభరణాలను తిరిగి ఇవ్వాలని, లండన్ లో ఉన్న తన కుమార్తెను చూసి వచ్చేందుకు ఈ నెల 5 నుంచి 20 వరకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రెండింటికి సంబంధించిన పిటిషన్లను ఉమ్మడి హైకోర్టులో గాలి తరపు న్యాయవాది నిన్న దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News