క్రికెట్: న్యూజిలాండ్ విజ‌య లక్ష్యం 203 ప‌రుగులు!

  • టీమిండియా స్కోరు 202 పరుగులు
  • అర్ధ సెంచ‌రీలు బాదిన శిఖ‌ర్ ధావ‌న్‌, రోహిత్ శ‌ర్మ
  • న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో ఇష్ సోథీకి రెండు వికెట్లు, బౌల్ట్‌కి ఒక్క వికెట్

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జ‌రుగుతోన్న టీ20లో న్యూజిలాండ్ ముందు టీమిండియా 203 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. 51 బంతుల్లో 80 ప‌రుగులతో శిఖ‌ర్ ధావ‌న్ అద్భుతంగా రాణించ‌గా, రోహిత్ శ‌ర్మ కూడా దూకుడుగా ఆడుతూ 55 బంతుల్లో 80 ప‌రుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా డకౌట్ కాగా, విరాట్ కోహ్లీ 26 (11 బంతుల్లో) , ధోనీ 7 (2 బంతుల్లో) ప‌రుగులు చేశారు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 202/3 ప‌రుగులు చేసింది. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో  ఇష్ సోథీకి రెండు వికెట్లు ద‌క్కగా, బౌల్ట్‌కి ఒక్క వికెట్ ద‌క్కింది.

  • Loading...

More Telugu News