జానా: సీఎం కారు ఎండలో పెట్టుకోవాల్సి వస్తోందని కొత్త భవనం కడతారట:టీ కాంగ్రెస్ నేతలు ఎద్దేవా

  • కొత్త సచివాలయం అంశంపై జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డి విమర్శలు
  • రూ.500 కోట్లతో కొత్త భవనం కడతారా?
  • ఇటువంటి స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎప్పుడూ చూడలేదన్న నేతలు

సీఎం కేసీఆర్ కారు ఎండలో పెట్టుకోవాల్సి వస్తోందని, రూ.500 కోట్లతో కొత్త భవనం కడతారట అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు అవసరం లేదని, వాస్తు కోసం వందల కోట్లు దుర్వినియోగం చేస్తారా? అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతు సమస్యలపై ఈరోజు అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం కేసీఆర్, మంత్రులే ఎక్కువ సేపు మాట్లాడారని, డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. ఇలాంటి స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను తామెన్నడూ చూడలేదంటూ వారి తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News