‘గరుడ వేగ’: ‘గరుడ వేగ’ ట్రైలర్ బాగుందని చిరంజీవి మెచ్చుకున్నారు: హీరో రాజశేఖర్

  • చిరంజీవిని ఇటీవలే కలిశా
  • ‘గరుడ వేగ’ చూసేందుకు ఆహ్వానించా
  • పాత్రికేయులతో రాజశేఖర్

‘గరుడ వేగ’ ట్రైలర్ బాగుందని మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారని హీరో రాజశేఖర్ అన్నారు. వచ్చే నెల 3న ‘గరుడ వేగ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజశేఖర్ మాట్లాడుతూ, చిరంజీవిని ఇటీవలే కలిశానని, ‘గరుడ వేగ’ సినిమా చూసేందుకు ఆయన్ని ఆహ్వానించానని చెప్పారు. ‘గరుడవేగ’ ట్రైలర్ చూశానని, బాగుందని చిరంజీవి ఈ సందర్భంగా ప్రశంసించారని, చిరు ఆఫీసులో కూడా ఈ సినిమా గురించే మాట్లాడుకొంటున్నారని మెగాస్టార్ తనతో చెప్పిన విషయాన్ని రాజశేఖర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా కుమార్, శ్రద్ధాదాస్, సంజయ్ రెడ్డి తదితరులు నటించారు. బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఓ స్పెషల్ సాంగ్ లో కనపడనుంది.

  • Loading...

More Telugu News