రామ్ గోపాల్ వర్మ: ‘అల్ట్రా అల్టిమేట్ ఇమేజ్ ఇది!’: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై మరో డిజైన్ వదిలిన రామ్ గోపాల్ వర్మ

  • హరిణి తన అద్భుత అవగాహనతో రూపొందించిన ఇమేజ్
  • నన్ను ఎంతగానో ఆకట్టుకుంది
  • ‘ఫేస్ బుక్’ పోస్ట్ లో వర్మ

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన నాటి నుంచి ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఆయనపై గుప్పించారు. ఎన్టీఆర్ కీర్తికి భంగం వాటిల్లకుండా ఈ చిత్రాన్ని రూపొందించాలని, లేని పక్షంలో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని టీడీపీ మంత్రులు, నాయకులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఆయా వ్యాఖ్యలకు తనదైన శైలిలో సమాధానాలు చెబుతున్న వర్మ తాజాగా, తన ‘ఫేస్ బుక్’ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.

 ‘హరిణి తన అద్భుత అవగాహనతో, సృజనాత్మకతతో, అసాధారణ రీతిలో రూపొందించిన అల్ట్రా అల్టిమేట్ ఇమేజ్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది’ అని ఆ ట్వీట్ లో వర్మ వ్యాఖ్యానించారు. కాగా, నాడు చంద్రబాబునాయుడు, భువనేశ్వరి వివాహ వేడుకలో ఎన్టీఆర్ దంపతులు ఉన్న ఫొటోను ఉంచి .. దాని కింద ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే టైటిల్ ఉంది. ఇక, ఈ పోస్ట్ పై నెటిజన్లు భిన్న రీతిలో స్పందించారు.

  • Loading...

More Telugu News