చంద్రబాబు: కేన్సర్ బాధితురాలిని చూసి చలించిన చంద్రబాబు.. ఆర్థిక సాయం ప్రకటన!

  • సీఎం చంద్రబాబును కలిసిన గుంటూరు జిల్లాకు చెందిన దివ్య
  • దివ్య పరిస్థితిని చూసి చలించిపోయిన వైనం
  • వైద్య సాయం కోసం రూ.15 లక్షలు ప్రకటించిన ముఖ్యమంత్రి

గుంటూరు జిల్లా చినకాకానికి చెందిన కేన్సర్ వ్యాధి బాధితురాలు దివ్య వైద్యం కోసం ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరింది. ఈ రోజు ఆమె సీఎం చంద్రబాబును కలిసి తన పరిస్థితిని వివరించింది. దీంతో, చలించిపోయిన ముఖ్యమంత్రి, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.15 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. కాగా, తనకు ఆర్థిక సాయం లభించనుండటంపై దివ్య సంతోషం వ్యక్తం చేసింది.  

  • Loading...

More Telugu News