Rahul Gandhi: కుక్క వీడియోను పోస్ట్ చేసి.. తానే స్వ‌యంగా ట్వీట్లు చేస్తున్నాన‌ని చెప్పుకున్న రాహుల్ గాంధీ

  • ట్విట్ట‌ర్‌లో అమాంతం పెరిగిపోయిన రాహుల్ గాంధీ పాప్యులారిటీ
  • ఆ ట్వీట్లు చేస్తోంది రాహుల్ గాంధీ కాద‌ని అంటోన్న రాహుల్‌ ప్ర‌త్య‌ర్థులు
  • తానే ట్వీట్లు చేస్తున్నాన‌ని ఓ వీడియో పోస్ట్ చేసి సెటైర్ వేసిన రాహుల్‌
  • రాహుల్ ఓ కుక్క వీడియోను పోస్ట్ చేయ‌డంపై చ‌ర్చ‌

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి ఈ మ‌ధ్య ట్విట్ట‌ర్‌లో పాప్యులారిటీ బాగా పెరిగిపోయిన విష‌యం తెలిసిందే. ఎన్న‌డూ లేని విధంగా కొత్త త‌ర‌హాలో ఆయ‌న‌ చేస్తోన్న‌ ట్వీట్ల‌తో ఆయ‌న ఫాలోవ‌ర్ల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. ఈ నేప‌థ్యంలో రాహుల్ గాంధీ ట్వీట్లు చేయ‌డానికి ఎవ‌రినో ఉద్యోగంలో పెట్టుకున్నారని కొంద‌రు సెటైర్లు వేస్తున్నారు. దీంతో ఆ ట్వీట్ల‌ను తానే చేస్తున్నాన‌ని రాహుల్ గాంధీ వినూత్నంగా చెప్పుకున్నారు.

 ఈ నేపథ్యంలో త‌న పెంపుడు కుక్క‌ను ఆడిస్తోన్న ఓ వీడియోను పోస్ట్ చేసి స‌ర‌దా వ్యాఖ్య చేశారు. త‌న‌కు బదులుగా ఎవరు ట్వీట్లు చేస్తున్నారని చాలామంది అడుగుతున్నారని, అయితే ఆ ట్వీట్లు చేస్తోంది తానేన‌ని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 'పీడీ (త‌న పెంపుడు కుక్క‌) చూడండి.. ట్వీట్‌తో నేనేం చేయగలనో.. కాదు కాదు.. ట్రీట్‌తో' అని పేర్కొన్నారు. అందులో రాహుల్ గాంధీ ట్రీట్‌కి ఆ కుక్క అటూ ఇటూ క‌దులుతోంది.

తాను త‌న‌ ట్వీట్‌తో త‌న ప్ర‌త్య‌ర్థుల‌ను దానిలా క‌దిలించ‌గ‌ల‌నని రాహుల్ ఉద్దేశం. రాహుల్ చేసిన ఈ ట్వీట్‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. ఈ ట్వీట్‌ని ఒక్కొ‌క్క‌రు ఒక్కోలా అర్థం చేసుకుంటున్నారని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News