Rahul Gandhi: ఆ రెండు అంశాలే భార‌త‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బ‌తీశాయి: రాహుల్ గాంధీ

  • జీఎస్‌టీ, పాత‌ నోట్లరద్దు అంశాల వ‌ల్ల న‌ష్టాలు
  • మోదీ ఇప్పటికీ అంగీకరించడం లేదు
  • ఆ రోజున బీజేపీ 'నల్లధన వ్యతిరేక దినం' పాటించవ‌ద్దు

కేంద్ర ప్ర‌భుత్వంపై వినూత్న రీతిలో విమ‌ర్శ‌లు చేస్తోన్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. అందుకోసం నరేంద్ర మోదీ ప్ర‌భుత్వంలో అమ‌లులోకి వ‌చ్చిన జీఎస్‌టీతో పాటు నోట్లరద్దు అంశాన్ని బాగా ఉప‌యోగించుకుంటున్నారు. ఈ రెండు అంశాలే భార‌త‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బ‌తీశాయ‌ని తాజాగా మ‌రోసారి వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు విష‌యం ఘోరంగా విఫలమైందన్న విష‌యాన్ని మోదీ ఇప్పటికీ అంగీకరించడం లేదని అన్నారు.

గ‌త ఏడాది నవంబర్ 8న పాత నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న‌ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాలు వ‌చ్చేనెల 8న నిర‌స‌న‌లు తెల‌పాల‌ని పిలుపునివ్వ‌గా బీజేపీ మాత్రం ఆ రోజున నల్లధన వ్యతిరేక దినంగా పాటించాలని త‌మ కార్య‌క‌ర్త‌లకు సూచించింది. బీజేపీ ఇటువంటి పిలుపును ఎందుకు ఇచ్చిందో తనకు అర్థం కావడం లేదని రాహుల్ అన్నారు. దేశ‌ ప్రజల మనోగతాన్ని కేంద్ర ప్ర‌భుత్వం అర్థం చేసుకోవాలని అన్నారు. ఆ రోజున ఉత్సవాలు జరుపుకునే ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు.  

  • Loading...

More Telugu News