న్యూజిలాండ్: దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్!
- దూకుడుగా ఆడుతున్న న్యూజిలాండ్ ఓపెనర్ మన్రో
- ఇప్పటికే 4 ఫోర్లు, 1 సిక్స్ బాదిన మన్రో
- న్యూజిలాండ్ ముందు భారీ విజయ లక్ష్యం
మూడో వన్డేలో 338 పరుగుల విజయ లక్ష్యంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభించింది. న్యూజిలాండ్ ఓపెనర్లు గప్తిల్, మున్రోలు బ్యాటింగ్ కు దిగారు. మున్రో దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరిగెత్తిస్తున్నాడు. ఇప్పటి వరకు పదమూడు బంతులు ఆడిన మున్రో అందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు.
4.1 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ ఒక్క వికెట్టు కూడా నష్టపోకుండా 34 పరుగులు చేసింది. కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన భారత జట్టు 337 పరుగులు చేసి భారీ విజయ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది.