ఫ్రెంచ్ ఓపెన్: ఫ్రెంచ్ ఓపెన్ నుంచి పీవీ సింధు ఔట్!

  • జపాన్ క్రీడాకారిణి చేతిలో సింధు ఓటమి
  • వరుసగా రెండు గేమ్స్ లో సత్తా చాటిన యమగుచి
  • సింధు అభిమానులకు నిరాశ!

ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ లో భారత షట్లర్ పీవీ సింధు ఓటమిపాలైంది. జపాన్ క్రీడాకారిణి యమగుచి చేతిలో సింధు ఓడిపోయింది. 21-14, 21-9 తేడాతో సింధుపై యమగుచి విజయం సాధించింది. కాగా, ఫ్రెంచ్ ఓపెన్ లో సెమీస్ కి చేరడం సింధుకు ఇదే మొదటిసారి. చైనా షట్లర్ యుఫీతో నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు విజయం సాధించింది. అయితే, ఈ రోజు జరిగిన సెమీస్ లో విజయం సాధించి ఫైనల్స్ కు చేరుతుందని ఆశించిన సింధు అభిమానులకు నిరాశే ఎదురైంది.

  • Loading...

More Telugu News