సామాజిక స్మగ్లర్లు: ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ టైటిల్ కు మద్దతు తెలపలేను!: టీపీసీసీ నేత అద్దంకి దయాకర్

  • మా ఇంట్లోనే కోమట్లు అద్దెకు ఉంటున్నారు
  • నా మిత్రుల్లో ఆ కులస్తులు ఉన్నారు
  • ఎంతో కష్టపడి వాళ్లు చదువుకున్నారు..వాళ్లని స్మగ్లర్లుగా చూడలేను
  • ఓ ఇంటర్వ్యూలో దయాకర్

‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తక రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు దళితుల నుంచి మద్దతు రావడానికి కారణం ఆయన అంబేద్కరిస్ట్ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. తెలంగాణ ఉద్యమనేత, మాలమహానాడు అధ్యక్షుడు, విద్యార్థి నాయకుడు దయాకర్ తో ‘ఐ డ్రీమ్’ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’  పుస్తకం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఈ పుస్తకం టైటిల్ విషయంలో మద్దతు తెలపలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే, మా ఇంట్లోనే కోమట్లు కిరాయికి ఉంటున్నారు. మా ఇంట్లో కొట్టుపెట్టుకుని ఉండాల్సిన అవసరం వాళ్లకి వచ్చింది. అంటే, దళితుల ఇంట్లోనే కోమట్లు కిరాయికి తీసుకుని ‘బతుకు జీవుడా!’ అంటూ బతికిన రోజులు చూసినా. నా క్లాస్ మేట్స్ కోమట్లు ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్ షిప్స్ తో మేము చదువుకుంటే, మా క్లాస్ మేట్స్ (కోమట్లు) తల్లిదండ్రులు వాళ్ల జీవితాలను వెచ్చించి పిల్లల్ని చదివించుకున్నారు. కాబట్టి, వాళ్లను స్మగ్లర్లుగా చూడడానికి నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News