అసెంబ్లీ సమావేశం: పక్క రాష్ట్రం అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతోందో అంద‌రికీ తెలుసు: హ‌రీశ్‌రావు

  • ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నప్పుడే మైక్‌ కట్ చేస్తున్నారు
  • కాంగ్రెస్ నేతల దగ్గర సరుకు, స‌బ్జెక్ట్‌ లేవు
  • అసెంబ్లీని ముట్టడిస్తామనడం కాంగ్రెస్ అసహన రాజకీయాలకు నిదర్శనం
  • మేము చర్చలకు సిద్ధం

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించుకుందామంటే ఎన్ని రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఈ నెల 27 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విష‌యం తెలిసిందే. అయితే, రైతుల సమస్యలను తెలంగాణ స‌ర్కారు పట్టించుకోవ‌డం లేద‌ని తెలుపుతూ, ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్‌ ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టనుంది.

ఈ నేప‌థ్యంలో స్పందించిన మంత్రి హ‌రీశ్ రావు.. పక్క రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతోందో అంద‌రికీ తెలుసని అన్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నప్పుడే మైక్‌ కట్ చేస్తున్నార‌ని అన్నారు. తెలంగాణలో మాత్రం అలా చేయ‌డం లేద‌ని చెప్పారు. కాంగ్రెస్ నేతల దగ్గర సరుకు, స‌బ్జెక్ట్‌ లేవని హ‌రీశ్ రావు ఎద్దేవా చేశారు. అసెంబ్లీని ముట్టడిస్తామనడం కాంగ్రెస్ అసహన రాజకీయాలకు నిదర్శనమని చెప్పారు. తాము చర్చలకు సిద్ధమని చెబుతూనే ఉన్నామ‌ని, అయిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ వీధి పోరాటాలు చేస్తామంటోందని చుర‌క‌లంటించారు.

 అసెంబ్లీ ముట్టడి విషయంలో కాంగ్రెస్‌ నేత జానారెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. తాము మూడు నుంచి నాలుగు వారాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నామని హ‌రీశ్ రావు అన్నారు. కాంగ్రెస్‌ నేతలు నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News