: కాంగ్రెస్ ఎంపీల మధ్య చిచ్చురేపుతున్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ


పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అంశం స్పర్ధ రగిల్చింది నందమూరి కుటుంబ సభ్యుల మధ్యే కాదండోయ్.. తాజాగా కాంగ్రెస్ సభ్యుల్లో కూడా ఈ కార్యక్రమం చిచ్చురేపింది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు రెండు గ్రూపులుగా విడిపోయినట్టు సమాచారం. కావూరి సాంబశివరావు, అనంత వెంకటరామిరెడ్డి, పనబాక లక్ష్మి, సాయి ప్రతాప్ లు నేడు అధినేత్రి సోనియాను కలిసి తాము ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు హాజరు కాబోమని తేల్చిచెప్పారు. అంతేగాకుండా.. ఎన్టీఆర్ కాంగ్రెస్, చిరంజీవి కాంగ్రెస్ పేరిట గ్రూపు రాజకీయాలకు తెరదీస్తున్నారని సోనియమ్మకు ఫిర్యాదు కూడా చేశారు.

  • Loading...

More Telugu News