అచ్చెన్నాయుడు: 2019లో పులివెందుల సహా 175 స్థానాల్లో గెలుస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు
- జగన్ పాదయాత్ర కాదు, పొర్లు దండాలు పెట్టినా లాభం లేదు
- పనికి మాలిన విమర్శలు చేస్తున్న జగన్ అద్దె మైక్ లు
- విమర్శలు గుప్పించిన అచ్చెన్నాయుడు
2019 ఎన్నికల్లో పులివెందుల సహా 175 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ పాదయాత్ర చేయడం కాదు, పొర్లు దండాలు పెట్టినా ఫలితం ఉండదని, వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవరని అన్నారు. జగన్ అద్దె మైక్ లు పనికిమాలిన విమర్శలు చేస్తున్నాయంటూ ఆ పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించారు.
కాగా, మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, జగన్ ది పలాయనవాదమని, అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తే, ప్రతిపక్షనేత కార్యక్రమాలకు అనుగుణంగా అసెంబ్లీ సమావేశాలు జరగవని అన్నారు. లోటస్ పాండ్ కు, అసెంబ్లీకి తేడా లేదని జగన్ భావిస్తున్నారేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.