: పిలవకపోతే కేసు పెడతా: లక్ష్మీపార్వతి బెదిరింపు
పార్లమెంటులో తన భర్త ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు తనను ఆహ్వానించకపోతే స్పీకర్ మీరాకుమార్, పురందేశ్వరిలపై కేసు పెడతానని లక్ష్మీపార్వతి బెదిరింపు స్వరం వినిపిస్తున్నారు. తనకు పిలుపు అందకపోవడానికి పురందేశ్వరే కారణమని ఆరోపించారు. విగ్రహావిష్కరణకు తనను పిలవాలని కోరే హక్కు తనకుందని ఆమె స్పష్టం చేశారు.