రామోజీరావు: ‘ఈనాడు’ అధినేత రామోజీరావును కలిసిన జగన్!
- రామోజీరావుతో నలభై నిమిషాల పాటు భేటీ
- జగన్ వెంట భూమన కరుణాకర్ రెడ్డి
- రామోజీరావు ఆశీస్సుల కోసమే జగన్ వెళ్లారంటున్న వైసీపీ వర్గాలు
‘ఈనాడు’ అధినేత రామోజీరావును వైసీపీ అధినేత జగన్ కలిసినట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం సుమారు 40 నిమిషాల పాటు ఆయనతో జగన్ భేటీ అయినట్టు తెలుస్తోంది. జగన్ వెంట భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నట్టు సమాచారం. సీబీఐ కోర్టు తీర్పు, త్వరలో తలపెట్టనున్న పాదయాత్ర గురించి రామోజీరావుతో చర్చించినట్టు సమాచారం. కాగా, నవంబర్ 2 నుంచి జగన్ పాదయాత్ర తలపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామోజీరావు ఆశీస్సులు తీసుకునేందుకు జగన్ ఆయన వద్దకు వెళ్లారని వైసీపీ వర్గాల సమాచారం.