తాజ్ మహల్: తాజ్ మహల్ ను ఎప్పుడు పడగొట్టాలనుకుంటున్నారో చెప్పండి!: ప్రకాష్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు
- వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్
- తాజ్ మహల్ చరిత్ర తవ్వకాలు మొదలుపెట్టారు
- ఎప్పుడు పడగొడతారో చెబితే మా పిల్లలకు చివరిసారిగా చూపిస్తా!
చారిత్రక కట్టడం తాజ్ మహల్ పై పలు వ్యాఖ్యలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. ‘తాజ్ మహల్ చరిత్ర తవ్వకాలు మొదలు పెట్టారు. ఇంతకీ, తాజ్ మహల్ ను ఎప్పుడు పడగొట్టాలని అనుకుంటున్నారో చెబితే, మా పిల్లలకు చివరిసారిగా తాజ్ మహల్ ను చూపిస్తా’ అని తన ట్వీట్ లో ప్రకాష్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
అంతకుముందు చేసిన మరో ట్వీట్ లో ‘ప్రశ్నించడం కొనసాగిస్తా. ఇది నా ప్రాథమిక హక్కు... నేను వ్యక్తపరిచిన భావాలను విభేదించే హక్కు ప్రతిఒక్కరికీ ఉంది. నాపై ఎవరైతే అదేపనిగా విమర్శలు గుప్పిస్తున్నారో వారి పదజాలం చాలా అసహ్యం కల్గిస్తోంది. మీరు చేసే ప్రతి దూషణ కారణంగా నా భావాలను మరింత దృఢంగా చెప్పే శక్తి నిస్తుంది..’ అని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు.