ప్ర‌భాస్‌: హ్యాపీ బర్త్ డే డార్లింగ్.. అల్లు అర్జున్ సహా ప్ర‌భాస్‌కి ప్ర‌ముఖుల శుభాకాంక్ష‌లు!

  • ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు
  • ‘పుట్టినరోజు జే జే లు రాజు గారికి’ అని పేర్కొన్న ద‌గ్గుబాటి రానా
  • ప్ర‌భాస్‌తో తీసుకున్న ఫొటోల‌ను అభిమానులతో పంచుకుంటోన్న ప్రముఖులు

ఈశ్వ‌ర్ సినిమాతో సినీ రంగంలోకి ప్ర‌వేశించి వ‌ర్షం, ఛ‌త్ర‌ప‌తి, డార్లింగ్‌, మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్‌, మిర్చి, బాహుబ‌లి సినిమాల‌తో టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒక‌రిగా నిలిచిన ప్ర‌భాస్ ఈ రోజు పుట్టిన రోజు జ‌రుపుకుంటోన్న సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ప్ర‌భాస్‌తో దిగిన ఫొటోల‌ను పోస్ట్ చేస్తున్నారు.

‘హ్యాపీ బ‌ర్త్ డే ప్ర‌భాస్ డార్లింగ్’ అని న‌టుడు అల్లు అర్జున్ పేర్కొన్నాడు. టాలీవుడ్‌ సినీ ప‌రిశ్ర‌మ‌కు డార్లింగ్ అయిన ప్ర‌భాస్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లంటూ సాయిధ‌ర‌మ్ తేజ్ ట్వీట్ చేశాడు. ‘పుట్టినరోజు జే జే లు రాజు గారికి’ అని పేర్కొన్న ద‌గ్గుబాటి రానా ‘బాహుబ‌లి’ సినిమాలో న‌టిస్తున్న‌ప్పుడు ప్ర‌భాస్‌తో తీసుకున్న ఫొటోల‌ను పోస్ట్ చేశాడు. న‌టుడు సుశాంత్‌, సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్, నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ ప్ర‌భాస్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు.  

  • Loading...

More Telugu News