పవన్ కల్యాణ్: జూనియర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం ఓపెనింగ్ రేపే.. ముఖ్యఅతిథిగా పవన్ కల్యాణ్!
- త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చిత్రం
- రేపు పూజా కార్యక్రమం
- క్లాప్ కొట్టనున్న పవన్ కల్యాణ్
త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్లో ఇది 28వ చిత్రం. ఈ చిత్రం పూజా కార్యక్రమం రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ అగ్రహీరో పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ సినిమాకు తొలి క్లాప్ కూడా పవనే కొట్టనున్నారు.
కాగా, ఈ చిత్రాన్ని హారికా & హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. 2018 జనవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా, ప్రస్తుతం త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతోంది. పవన్ సరసన అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేశ్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం.