జార్ఖండ్ ముఖ్యమంత్రి.: హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపిన జార్ఖండ్ ముఖ్యమంత్రి.. వీడియో వైరల్!
- జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ పై విమర్శలు
- ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం పట్ల విమర్శలు
- వీడియో వైరల్
దీపావళి పర్వదినాన జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ చేసిన పని విమర్శలకు తావిస్తోంది. నిన్న రాత్రి ఆయన రాంచీలో రోడ్డుపై హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకునే ద్విచక్ర వాహనాల్ని నడపాలని ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు సాధారణ ప్రజలకు సూచిస్తోంటే, మరోవైపు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే ఇలా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
పైగా, ద్విచక్ర వాహనంపై ఆయన ప్రయాణించిన సమయంలో సెక్యూరిటీ గార్డులు కూడా ఆయనతో లేరు. జంషెడ్ పూర్‌లోని తన నివాసంలో దీపావళి జరుపుకున్న అనంతరం రఘుబర్ దాస్ ఇలా ద్విచక్రవాహనంపై చక్కర్లు కొట్టారు. సదరు ముఖ్యమంత్రి తీరుపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.