జగన్: జగన్ 'వ్యక్తిగత హాజరు మినహాయింపు' పిటిషన్ పై వాదనలు పూర్తి.. 23న తీర్పు!
- వచ్చేనెల 2 నుంచి జగన్ పాదయాత్ర
- ఈ రోజు సీబీఐ కోర్టులో మరోసారి విచారణ
- ఈ పిటిషన్పై నిర్ణయాన్ని ఈ నెల 23న ప్రకటిస్తామన్న సీబీఐ కోర్టు
అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టులో హాజరు అవుతోన్న విషయం తెలిసిందే. అయితే, వచ్చేనెల 2 నుంచి తాను పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో ఆరు నెలల పాటు తనకు కోర్టులో వ్యక్తిగత హాజరుపై మినహాయింపు ఇవ్వాలని ఆయన వేసిన పిటిషన్పై ఈ రోజు సీబీఐ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. కోర్టులో వాదనలు ముగిశాయి. జగన్ తరుఫు న్యాయవాది వాదనలతో పాటు సీబీఐ అధికారుల విన్నతిని విన్న కోర్టు ఈ పిటిషన్పై నిర్ణయాన్ని ఈ నెల 23న ప్రకటిస్తామని వెల్లడించింది.