‘జబర్దస్త్’ రష్మీ: కాకరపువ్వొత్తు కాల్చుతూ డ్యాన్స్ చేస్తోన్న ‘జబర్దస్త్’ రష్మీ వీడియో!
- జబర్దస్త్ కామెడీ షోతో పాప్యులర్ అయిన రష్మీ
- సినిమాల్లోనూ నటిస్తూ అలరిస్తోన్న ముద్దుగుమ్మ
- దీపావళి శుభాకాంక్షలతో వీడియో పోస్ట్
ఈ టీవీలో ప్రసారం అవుతోన్న జబర్దస్త్ కామెడీ షోతో పాప్యులర్ అయిన రష్మీ సినిమాల్లో కూడా నటిస్తూ అలరిస్తోంది. ప్రస్తుతం ఆమె ఆది హీరోగా వస్తోన్న నెక్స్ట్ నువ్వే సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు ప్రతిరోజు తన ఫొటోను, వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.
ఈ రోజు దీపావళి సందర్భంగా ఆమె కాకరపువ్వొత్తు కాల్చుతూ ఆ వెలుగుల్లో కనిపించింది. మతాబులు వెలుగులు వెదజిమ్ముతుండగా ఆమె ఆనందంతో డ్యాన్స్ చేసేస్తోంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఈ పండుగను హెల్దీగా, సురక్షితంగా, శబ్దకాలుష్యం జరగకుండా జరుపుకోవాలని సందేశం ఇచ్చింది. అభిమానులను అలరిస్తోన్న ఆమె వీడియో మీరూ చూడండి...