కేటీఆర్: దుబాయ్‌లో ప్రసంగించనున్న తెలంగాణ మంత్రి కేటీఆర్
- దుబాయ్‌లో ఇండియా-యూఏఈ భాగస్వామ్య సదస్సు
- ఈ నెల 30, 31 తేదీల్లో సదస్సు
- తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్న కేటీఆర్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కి దుబాయ్‌లో జరిగే ఇండియా-యూఏఈ భాగస్వామ్య సదస్సులో పాల్గొని, ప్రసంగించే అవకాశం వచ్చింది. ఈ సదస్సు ఈ నెల 30, 31 తేదీల్లో జరగనుంది. యూఏఈతో మన దేశ వాణిజ్య సంబంధాల బలోపేతమే ధ్యేయంగా ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సులో భాగంగా ఈ నెల 30న జరిగే మంత్రుల స్థాయి సెషన్లో కేటీఆర్ పాల్గొని, తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. అలాగే, భారత్, యూఏఈ మధ్య వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్యంతో పాటు పలు అంశాలపై కేటీఆర్ మాట్లాడతారు.