రేవంత్ రెడ్డి: తాను ఢిల్లీ వెళ్లడానికి కారణాన్ని చెప్పిన రేవంత్ రెడ్డి!

  • టీఆర్ఎస్ ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై రేవంత్ రెడ్డి ఫిర్యాదు
  • అప్పట్లో కూలి ప‌నుల పేరిట డబ్బు సంపాదించిన టీఆర్ఎస్ నేతలు
  • అభ్యంతరం తెలుపుతూ ఈసీకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు

తాను ఢిల్లీలో ఉన్న నేప‌థ్యంలో కాంగ్రెస్ పెద్ద‌ల‌తో స‌మావేశం అవుతున్నానంటూ వస్తున్న వార్త‌లపై రేవంత్ రెడ్డి మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చారు. తాను టీఆర్ఎస్ నేత‌ల‌పై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లాన‌ని చెప్పారు. టీఆర్ఎస్ ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన కూలి ప‌నులు, త‌ద్వారా వ‌చ్చిన డ‌బ్బును పార్టీ అవ‌స‌రాల‌కు ఉప‌యోగించిన విధానంపై అభ్యంత‌రాలు చెబుతూ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గ‌తంలో ఇదే విష‌య‌మై తెలంగాణ సీఎస్‌కు కూడా ఆయ‌న‌ ఫిర్యాదు చేశారు. కాసేప‌ట్లో ఆయ‌న ఇదే విష‌య‌మై కేంద్ర హోం శాఖకు కూడా ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. 

  • Loading...

More Telugu News