దారుణ హత్య: తూ.గో.జిల్లా రామచంద్రపురం నగర టీడీపీ అధ్యక్షుడి కూతురి దారుణ హత్య!

  • టీడీపీ అధ్యక్షుడు నదుల రాజు ఇంట్లో దారుణ ఘ‌ట‌న
  • కూతురు దీపికను హత్య చేసి పరారైన దుండ‌గులు 
  • కూనపరెడ్డి మణికంఠ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న దీపిక

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టాణ టీడీపీ అధ్యక్షుడు నదుల రాజు ఇంట్లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆయ‌న కూతురు దీపికను దుండ‌గులు హ‌త్య చేసి ప‌రార‌య్యారు. ఈ ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఇప్ప‌టికి ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు.

 నిన్న రాత్రి త‌న‌ బార్ అండ్ రెస్టారెంట్ లో త‌న కుమారుడితో క‌లిసి ప‌నులు చేసుకున్న నదుల రాజు రాత్రి ఒంటి గంటకు ఇంటికి వ‌చ్చారు. అప్పటికే తన కుమార్తె దీపిక రక్త‌పు మ‌డుగులో ప‌డి ఉండడం చూసిన ఆయన.. ఆమెను ఆసుప‌త్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. కూనపరెడ్డి మణికంఠ అనే వ్యక్తితో ఆమె ప్రేమలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనూ పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. 

  • Loading...

More Telugu News