అక్కినేని: అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను 'అందగాడా, కమాన్' అంటూ పిలిచేవారు!: హాస్యనటుడు బాబుమోహన్
- అక్కినేని నన్ను ఎప్పుడూ పేరుపెట్టి పిలిచేవారు కాదు
- ‘అందగాడా, కమాన్’ అనే వారు
- మా అమ్మానాన్నలకు సీనియర్ ఎన్టీఆర్ అంటే వీరాభిమానం
- ఓ ఇంటర్వ్యూలో బాబుమోహన్
అక్కినేని నాగేశ్వరరావు గారు తనను పేరు పెట్టి ఎప్పుడూ పిలిచే వారు కాదని, ‘అందగాడా, కమాన్’ అనే వారని ప్రముఖ హాస్యనటుడు బాబుమోహన్ అన్నారు. తన తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నాగేశ్వరరావుగారు నాతో చాలా ఆప్యాయంగా ఉండేవారు. ప్రేమగా పలుకరించే వారు. మా అమ్మానాన్న చదువుకున్నవాళ్లు.. టీచర్లు. ఎన్టీఆర్ (సీనియర్)కు వీరాభిమానులు. ‘నువ్వు బాగా చదువుకోవాలి. మా జన్మ ధన్యం కావాలంటే.. మద్రాసు వెళ్లి ఎన్టీఆర్ గారిని దగ్గర నుంచి చూడాలిరా’ అని మా అమ్మానాన్న నాతో అనే వారు. నేనేమో స్కూల్ ఫైనల్ వరకు చదువుకుని, బతకడానికి ఓ ఉద్యోగం దొరికితే చాలని అనుకునేవాడిని’ అని చెప్పుకొచ్చారు.