మంచు విష్ణు: అమెరికా నుంచి ఇంటికి తిరిగొస్తున్నాను: మంచు విష్ణు

  • ‘ఆచారి అమెరికా యాత్ర’ అనే సినిమాలో నటిస్తోన్న విష్ణు
  • అమెరికాలో సినిమా షెడ్యూల్ పూర్తి
  • లాస్ ఏంజెల్స్, సీటెల్ లో జరిగిన షూటింగ్

యంగ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం ‘ఆచారి అమెరికా యాత్ర’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం అమెరికాకు వెళ్లిన తాను ఓ రిస్కీ షాట్ తీస్తున్నప్పుడు బైక్‌ మీద నుంచి పడిపోయానని మంచు విష్ణు ఇటీవ‌ల చెప్పుకున్న విష‌యం తెలిసిందే. అనంత‌రం చేతికి క‌ట్టు క‌ట్టుకుని ఓ వీడియో కూడా విడుద‌ల చేశాడు. ప్రస్తుతం అమెరికాలో ఆయ‌న షూటింగ్ షెడ్యూల్ ముగిసింది. దీంతో తిరిగి ఆయ‌న స్వ‌దేశానికి ప‌య‌నం అవుతున్నాడ‌ట‌.

ఈ రోజు మంచు విష్ణు ట్వీట్ చేస్తూ నలభై రోజుల సుదీర్ఘ షెడ్యూల్ ముగిసిందని.. ఇంటికి తిరిగొస్తున్నానని పేర్కొన్నాడు. లాస్ ఏంజెల్స్, సీటెల్ లో షెడ్యూల్ పూర్తైందని చెప్పాడు. ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాకి జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 

  • Loading...

More Telugu News