రవితేజ: రేపు ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుకుందాం..రండి!: సినీ హీరో రవితేజ పిలుపు
- ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు ‘రాజా ది గ్రేట్’ సినిమా
- రేపు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఫేస్‌బుక్ లైవ్‌లోకి రానున్న మాస్ మహారాజా
సినీనటుడు రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తోన్న రవితేజ రేపు ఫేస్‌బుక్ లైవ్‌లో కనపడనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను గురించి తన అభిమానులకు చెప్పనున్నాడు. తాను రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు అభిమానులతో మాట్లాడతానని చెప్పాడు. రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ చిత్రం దీపావళి సందర్భంగా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సినిమాలో రవితేజ అంధుడిగా నటిస్తున్నాడు.