దీపావళి సెలవులు: దీపావళి సెలవుల్లో స్వల్ప మార్పులు చేసిన తెలంగాణ సర్కారు
- అప్పట్లో 17న ఐచ్చిక సెలవు, 18న దీపావళి సెలవుగా ప్రకటన చేసిన ప్రభుత్వం
- ఐచ్చిక సెలవును 18కి, సాధారణ సెలవును 19కి మారుస్తున్నామని తాజా ప్రకటన
ఈ ఏడాది తెలంగాణ సర్కారు అధికారికంగా విడుదల చేసిన 2017 సెలవుల క్యాలెండర్ లో అక్టోబర్ 18న దీపావళిగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నెల 19న అమావాస్య ఉందని సెలవు తేదీని మార్చాలని ఉద్యోగ సంఘాలు, అధికారులు, టీచర్స్ యూనియన్ చేసిన వినతి మేరకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఆలోచించింది. అప్పట్లో 17న ఐచ్చిక సెలవు, 18న దీపావళి సెలవుగా ప్రకటన చేసిన ప్రభుత్వం.. ఈ రోజు ఐచ్చిక సెలవును 18వ తేదీకి ఇస్తున్నామని, సాధారణ సెలవును 19కి మారుస్తున్నామని అధికారిక ప్రకటన చేసింది.