రవితేజ: ‘గ్యాప్’ తీసుకోలేదు.. వచ్చింది: హీరో రవితేజ

  • కొన్ని కారణాల వల్ల గ్యాప్ వచ్చింది 
  • గ్యాప్ తర్వాత చాలా మంచి చిత్రంలో నటించా
  • ఓ ఇంటర్వ్యూలో రవితేజ

మాస్ మహరాజ్ రవితేజ రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు ‘రాజా ది గ్రేట్’ చిత్రం ద్వారా రానున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘టీవీ 9’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవితేజ మాట్లాడుతూ, ‘రెండేళ్ల‘ గ్యాప్’ తీసుకోలేదు..వచ్చింది. కొన్ని కారణాల వల్ల గ్యాప్ వచ్చింది. అయితే, గ్యాప్ తర్వాత చాలా మంచి చిత్రంలో నటించాను. ఈ సినిమా చాలా బాగుంది. రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా నేను ఎలాంటి టెన్షన్ పడట్లేదు. ఎప్పుడూ టెన్షన్ పడను .. ఇప్పుడు కూడా’ అని చెప్పుకొచ్చాడు.  

  • Loading...

More Telugu News