జగపతి బాబు: ‘కులం’ అనే పదమే నాకు నచ్చదు: సినీ నటుడు జగపతిబాబు

  • ‘కులం’ గురించి నాకు చాలా కాలం తెలీదు
  • ‘మనోడే’ అంటే ఏంటో అప్పుడు నాకు అర్థమైంది
  • అందరూ ఒకటే కదా అని అనుకునేవాడిని
  • ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు

‘కులం’ అనే పదమే తనకు నచ్చదని ప్రుముఖ సినీ నటుడు జగపతిబాబు అన్నారు. ‘టీవీ 9’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘‘కులం’ గురించి నాకు చాలా కాలం తెలీదు. ‘మనోడే’ అని నన్ను అంటుండే వాళ్లు. అంటే ఏంటో, నాకు అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత ఆ ‘మనోడే’ అంటే ఏంటో నాకు అర్థమైంది. ఇక, అప్పటి నుంచి మనోడే అయితే ఏంటీ, అందరూ ఒకటే కదా అనుకునేవాడిని. నా చిన్నతనం నుంచి ఈ ఫీలింగ్ ఉంది.

‘పండు గాడు కొడితే మైండ్ దిమ్మతిరిగి బ్లాక్ అవ్వాలి’ అన్నట్టు.. ఈ ‘కులం’ గొడవ ఎవరో పండుగారు పెడితే, దాని దెబ్బకు చాలా మంది మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ బ్లాక్ నుంచి బయటకు రావాలి. ఎవడో ఏదో కులం పెట్టాడు. ఆ కులంలో మనం పుట్టాం. ఆ కులం నాది అని అనుకోవడం మొదలైంది. నాది అని ఎప్పుడైతే ఫీలయ్యామో, ఇగో సమస్యలు వచ్చేశాయి..‘ ఐ నీడ్ మై సెల్ఫ్’ వచ్చేసింది’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News